మేము అంతే ……మార‌మంటున్నా టిడిపి

కొంద‌రు చెపితే వింటారు మ‌రి కొంద‌రు అర్థం చేసుకుంటారు ….కాని టిడిపి మాత్రం ఈ రెండిటికి భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తుంది .తాను ఏది చేస్తే అదే గొప్ప అనే భావ‌న‌లో టిడిపి ఉందనిపిస్తుంది .చేసేది తప్పైనా దాన్ని స‌మ‌ర్థించుకోవ‌డం టిడిపికి ఉన్నా గొప్ప ల‌క్ష‌ణం అని చెప్పుకున్నా అది త‌ప్పు కాద‌నే అనాలి .అధికారం త‌న‌దైతే త‌న రూటే స‌ప‌రేటు అంటూ టిడిపి ముందుకెళుతుంది .దీనికి నిద్శ‌నం తాజాగా కృష్ణ జిల్లాలో జై ఆంధ్రా ఉద్య‌మ నేత కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్ర‌హాన్ని పోలిసులు అర్థ‌రాత్రి చ‌డిచ‌ప్పుడు కాకుండా తొల‌గించడ‌మే అని చెప్పుకోవాలి .ఐతే ఇప్పుడు ఈ విగ్రహాం ఎవ‌రికి చెప్ప‌కుండా తొల‌గించాల్సిన అవ‌స‌రం ఎమోచ్చిందంటూ భిన్న వ‌ర్గాల నుండి విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి .అంతేకాదు కాకాని వెంక‌ట‌ర‌త్నం జై ఆంధ్రా ఉద్య‌మంలోనే కాదు గాంధీజీ ఉప్పు స‌త్యాగ్ర ఉద్య‌మంలో కూడ పాల్గోన్నారు .అటువంటి గొప్ప నేత విగ్ర‌హాన్ని కుటుంబ స‌భ్యుల‌కు లేదా క‌మిటి స‌భ్యుల‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా తొల‌గించ‌డం ఒక్క టిడిపికే చెల్లింద‌ని చెప్పాలి .ఐతే పోలిసులు మాత్రం ఇక్క‌డ ప్లైఓవ‌ర్ వెలుతుంద‌ని అందుకే ఇక్క‌డి నుండి విగ్ర‌హాం తీసేస్తున్నామ‌ని చెప్పుతున్నారు .ఐతే విగ్ర‌హాం వున్నా స్థ‌లంలో రోడ్డు కొసం ప్లైఓవ‌ర్ వెళితే ఆ విగ్ర‌హాంకు సంబంధించిన స‌మాచారం అనేది అక్క‌డి క‌మిటి స‌భ్యుల‌కు ఇవ్వ‌డ‌మ‌నేది చాలా ముఖ్యం .అస‌లు ఆ విగ్ర‌హాన్ని తీసి వేరే చోట పెడుతున్నారా లేక ఆ విగ్ర‌హాం ఎక్క‌డ పెడుతున్నారో కూడ తెలియ‌కుండా పొలిసులు విగ్ర‌హాం తీసేయ‌డం చూస్తే అధికార పార్టీ ఏం చేస్తే అది చెల్లుతుంది అనే విధంగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌న‌డంలో ఏ మాత్రం సందేహాం లేద‌నే చెప్పాలి . జై ఆంధ్రా ఉద్య‌మ నేత కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్ర‌హాం అర్థ‌రాత్రి ప్లోక్లైన్‌ల‌తో తొల‌గించ‌డయ‌నేది చూస్తుంటే రాష్ట్రం లోని టిడిపి పార్టీ ఉద్య‌మ‌కారుల‌ను చిన్న చూపు చూడ‌డంలో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతుంది . ఐతే ఇలాంటివి టిడిపిలో కొత్తేమి కాద‌నే చెప్పాలి .కాని తాజా ప‌రిస్థితుల‌ను చూస్తుంటే టిడిపి ఉద్య‌మ‌కారుల విగ్ర‌హాలు తొల‌గించి ప్ర‌జ‌ల మ‌నోభావాలు దేబ్బ తీసే చ‌ర్య‌లు చేస్తుంద‌న‌డంలో ఏ మాత్రం అతిశ‌యోక్తి లేద‌నే అనాలి .ఐతే ఇప్ప‌టికైనా టిడిపి ఇలాంటి చ‌ర్య‌లు మానుకుంటుందా లేక నా అధికారం నా ఇష్టం అనే విధంగా ప్ర‌వ‌ర్తిస్తుందా అంటే దానికి కాల‌మే స‌మాదానం చెప్పాలి .