మైక్రోమాక్స్‌ ఫోన్‌ పేలి యువకుడి మృతి

Phone Blast

Phone Blast

గాదిగూడ మండలం ముత్యంబట్టి గ్రామానికి చెందిన లాకడే నానేశ్వర్‌(20) సెల్‌ఫోన్‌ పేలి సోమవారం మృతిచెందాడు. ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. లాకడే నానేశ్వర్‌ వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు.

ఉదయం తన వద్ద ఉన్న మైక్రోమాక్స్‌ ఫోన్‌ ఇంట్లో చార్జింగ్‌ పెట్టాడు. అరగంట తర్వాత ఫోన్‌ రింగ్‌ కావడంతో చార్జింగ్‌ ఉండగానే మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేలింది. దీంతో షాక్‌కు గురై నానేశ్వర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి కాశీరాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.