మోడి ఇంకా ప‌గ చ‌ల్లార‌లేదా

ప్ర‌త్యేక హోద ఇస్తామని చెప్పి ఇవ్వ‌కుండా ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన మోడి ప్ర‌భుత్వానికి , ఆంధ్ర మీద ఇంకా ప‌గ చ‌ల్లార‌లేద‌ని అనిపిస్తుంది తాజా ప‌రిణామాల‌ను చూస్తుంటే ,. ఇప్ప‌టికే బిజేపి పై ఆంధ్ర‌లో తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త ఏర్ప‌డుతున్నా నేప‌ద్యంలో ,న‌రేంద్ర మోడి ఆంధ్ర ప్ర‌జ‌ల‌పై ఇంకా ఖ‌టినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు .తాజా వివ‌రాల ప్ర‌కారం మ‌న దేశంలో ఎంతో ప్ర‌సిద్ధి గాంచిన తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యం ప‌రిధిలోని ఆల‌యాల‌ను కేంద్ర పురావ‌స్తు శాఖ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని కేంద్రం భావిస్తుంద‌ట ,దేశంలోనే ప్ర‌సిద్ధి గాంచిన తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యం ఆంధ్రాలో డండ‌డంతో ,ఇప్పుడు ఆ దేవాల‌యాన్ని కావాల‌నే మోడి ప్ర‌భుత్వం కేంద్ర పురావ‌స్తుశాఖ ఆధీనంలోకి తీసుకురావాల‌ని చూస్తుందంటూ కొంద‌రు భాహాటంగానే మాట్లాడుకుంటున్నారు .టిటిడిని కేంద్ర‌పురావ‌స్తు శాఖ ఆధీనంలోకి తీసుకురావాల‌నే విష‌యం పై చాలా వర్గాల నుండి మోడి పై వ్య‌తిరేక‌త ఏర్ప‌డ‌డంతో కేంద్రం వెన‌క‌డుగు వేసింది .అయితే మోడి ప్ర‌భుత్వం చెప్పెది మాత్రం మ‌రోలా వుంది .తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామి ప‌రిధిలోని ఆల‌యాల‌న్ని చాలా పురాత‌న ఆల‌యాల‌ని వాటిని స‌రిగా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ,పురాత‌న ఆల‌యాల‌ను తీసి వేసి వాటి స్థానంలో కొత్త ఆల‌యాల‌ను నిర్మిస్తున్నారంటూ మాకు పిర్యాదులు అందాయ‌ని కేంద్రం చెప్పుకొచ్చింది .అంతేకాకుండా పురాత‌న కాలంలో రాజులు ఇచ్చిన ఆభ‌ర‌ణాలు ,భ‌క్తులు వేసే కానుక‌లు స‌రిగా భ‌ద్ర‌ప‌ర‌చ‌డం లేదంటూ కూడ కొన్ని పిర్యాదులు మా దృష్టికి వ‌చ్చాయ‌ని అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మోడి ప్ర‌భుత్వం పెర్కోంది . అయితే ఈ విష‌యం పై టిటిడి ఈవో స్పందిస్తూ ఎట్టి ప‌రిస్థితిలో టిటిడి ప‌రిధీలోని ఆల‌యాల‌ను కేంద్ర పురావ‌స్తు శాఖ‌కు అప్ప‌గించే ప్ర‌స‌క్తే లేద‌ని ఖ‌రాకండిగా తెల్చిచెప్పారు . కేంద్ర వైఖ‌రి ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గోట్టే విధంగా వుందంటూ కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు .