మోదీని కౌగిలించుకున్న రాహుల్‌ గాంధీ

పార్లమెంట్‌ సమావేశాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. లోక్‌సభలో శుక్రవారం ఊహించని దృశ్యం కంటపడింది. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఎవరూ ఊహించని విధంగా ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మోదీ సర్కారు తీరును తీవ్రంగా తూర్పాబట్టారు. తనపై రాహుల్‌ విమర్శలు చేస్తున్నా మోదీ మాత్రం నవ్వుతూ కనిపించారు.