యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ ట్వీట్‌కు… కొర‌టాల స‌మాధానం

హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరుమీదున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తాజాగా మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. మ‌హేష్ బాబు హీరోగా ఆయ‌న రూపొందించిన `భ‌ర‌త్ అనే నేను` అంద‌రి ప్ర‌శంస‌ల‌నూ అందుకుంటూ భారీ క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. ఈ సినిమాను సామాన్యులే కాకుండా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఇష్టపడుతున్నారు.

ఈ సినిమాను ప్ర‌శంసిస్తూ ఇప్ప‌టికే ఎంతో మంది సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శంసించారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ కూడా ఈ సినిమాను ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ట్వీట్‌కు స్పందిస్తూ.. `థాంక్యూ వెరీ మ‌చ్ అన్నా` అని కొర‌టాల స‌మాధానం ఇచ్చారు. ఎన్టీయార్‌తోపాటు ఈ సినిమాను ప్ర‌శంసించిన‌ రామ్‌చ‌ర‌ణ్‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌, వంశీ పైడిప‌ల్లి, రాజ‌మౌళిల‌కు కొరటాల శివ ధన్య‌వాదాలు తెలియ‌జేశారు.