రాజ‌కియాల్లో వేగం పెంచిన ర‌జిని కాంత్

ఇండియాలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తుల‌లో ర‌జిని కాంత్ ఒక్క‌రు .ప్ర‌పంచ వ్యాప్తంగా కూడ ర‌జిని కాంత్‌కు మంచి గుర్తింపు ఉంది .ఐతే త‌మిళ ప్ర‌జ‌లు మాత్రం ర‌జిని కాంత్‌ను ఒక దేవునిగా కొలుస్తార‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదనే అనాలి . జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో త‌మిళ నాట రాజ‌కీయాలు తీవ్ర మ‌లుపులు తిరిగాయి . గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుండి ర‌జిని రాకీయంలోకి రావాల‌ని అభిమానులు అడిగిన‌ప్పుడ‌ల్ల దేవుడు ఎప్పుడు ర‌మ్మంటే అప్పుడు వ‌స్తాన‌ని దాట‌వేస్తు వచ్చారు . ఐతే ఒక వైపు జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో త‌మిళ నాట నెల‌కొన్నా రాజ‌కీయ ప‌రిస్థితులు ,మ‌రోవైపు రాజ‌కీయాల్లోకి రావాలంటు ఎప్ప‌టి నుంచో ఉన్నా అభిమానుల కోరిక‌ను తీర్చ‌డానికి ,గ‌త డింసెంబ‌ర్ నెల‌లో ర‌జిని రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌ట‌న చేసారు .ఐతే పార్టీ ప్ర‌క‌ట‌న చేసి అయిదు నెల‌లు కావ‌స్తున్నా ర‌జిని ఎలాంటి క‌ర్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌లేదు .అంతే కాదు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క భారి భ‌హిరంగ స‌భ‌ కూడ నిర్వ‌హించ‌లేదు.అంతే కాదు రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టినుండి ర‌జిని ప్ర‌తిప‌క్షాల‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు కూడా చేయ‌లేదు .దీంతో అభిమానుల‌లో నిరాశ అనేది మొద‌లైంది .ఐతే తాజాగా ర‌జిని పార్టీ కార్య‌ద‌ర్శ‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు .ఈ స‌మావేశంలో ప్ర‌జాస‌మ‌స్య‌లు , ప్ర‌జ‌ల్లోకి ఎలా వెళ్ళాలి అనే వాటిపై ఎక్కువ‌గా మాట్లాడిన‌ట్టు స‌మాచారం . ఐతే గ‌తంలో ర‌జిని రాజ‌కీయ ప్ర‌క‌ట‌న చేసిన స‌మ‌యంలో ఎంజీఆర్ పాల‌న‌ను మ‌రిపిస్తాని హామి ఇచ్చారు. తాజాగా ర‌జిని అనుస‌రిస్తున్నా తీరును చూస్తుంటే అదే నిజ‌మ‌నిపిస్తుంది .ఎంజీఆర్ రాజ‌కీయంలోకి రావ‌డానికి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ,రాజ‌కీయంలోకి ఎలా వెళ్ళాల‌నే అంశ‌పై ఒక బృంద‌లా ఏర్ప‌డి ముందుకు వెళుతూ సీఎం సీటులో కుర్చున్నారు . ప్ర‌స్తుతం ర‌జిని కూడా అదే పంథాని అనుస‌రిస్తున్నార‌నిపిస్తుంది .. వ‌చ్చె నెలలో కొయంబ‌త్తూర్‌లో స‌భ నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు ర‌జిని పార్టీ కార్య‌ద‌ర్శుల స‌మావేశంలో వెల్ల‌డించిన‌ట్లు వినికిడి . గ‌తంలో ర‌జిని రాజ‌కీయ ప్ర‌వేశం పై ప్ర‌క‌ట‌న చేసిన టైంలో త‌మిళ‌నాడులోని అన్ని స్థానాల‌లో పోటి చేస్తామ‌ని చెప్పారు . ఐతే ఇప్పుడు ర‌జిని వేగం చూస్తుంటే ఆ మాట నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నిపిస్తుంది .ఇన్ని రోజులు సినిమాల‌తో ,విదేశి టూర్ల‌తో బిజీగా ఉన్నా ర‌జిని ప్ర‌స్తుతం పార్టీని ముందుకు తీసుకెళ్ళే ఆలోచ‌న‌లు క‌నిపిస్తున్నాయి .ఐతే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ర‌జిని ఇప్పుడు ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడా లేదా ప్ర‌తిప‌క్షాల అవినీతిని ఎండ‌గ‌డ‌తాడా అనేది అంద‌రిలో మొద‌లైనా ప్ర‌శ్న‌.ఎదిఏమైనా కాని ఇన్ని రోజులు సినిమాల‌తో జీవితం గ‌డిపిన ర‌జిని ఇత‌రుల‌కు స‌హాయం చేయ‌డంలో ఎప్పుడు వెన‌క‌డుగు వేయ‌లేదు .అలాంటి హీరో అయినా ర‌జిని కాంత్ రాజ‌కీయంలోకి రావాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు .