రానంటే కాళ్ళు చేతులు క‌ట్టేయండి —బిజేపి

క‌ర్ణాట‌క ఎన్నిక‌లో పార్టీల ప్ర‌చారం రొజురోజుకు కొత్త పుంత‌లు తొక్కుతుందా అంటే అవున‌నే అనాల‌నిపిస్తుంది ఇప్పుడున్నా ప‌రిస్థితుల‌ను చూస్తుంటే ,మే 12న జ‌రిగే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో మేమంటే మేమే గెలువాల‌ని ఆ రాష్ట్రంలోని మూడు ప్ర‌దాన పార్టీలు పోటి ప‌డి మ‌రి ప్ర‌చారం చేస్తున్నాయి .అయితే కాంగ్రేస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ త‌రుపున ప్ర‌చారం చేస్తుంటే ,బిజేపి త‌రుపున స్వ‌యంగా ప్ర‌దాని న‌రేంద్ర మోడి ప్ర‌చారంలోకి దిగారు .అయితే మాజీ ప్ర‌దాని దేవేగౌడ్ ప్రాంతీయ పార్టీ అయిన జేడిఎస్‌ను అధీకారంతోకి తీసుకురావ‌డానికి ఆయ‌న త‌న‌యుడు కుమార స్వామి కూడ చాలా తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు .అయితే ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్ది రాజ‌కీయ నాయ‌కులు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు .కానీ క‌ర్ణాట‌క బిజేపి సిఎం అభ్య‌ర్థి యాడ్యుర‌ప్ప తాజాగా జ‌రిగిన బెళ‌గావి స‌భ‌లో ఓట‌ర్ల‌పై చెసిన కొన్ని వివాద‌స్ప‌ద వ్యాక్య‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా చేసాయి .బెళ‌గావి స‌భ‌లో క‌ర్ణాట‌క సీఎం అభ్య‌ర్థి యాడ్యుర‌ప్పా మాట్లాడుతూ మే 12 న జ‌ర‌గ‌బోయే ఎల‌క్ష‌న్‌లో ప్ర‌జ‌లంద‌రు ఓటు వేయాల‌ని ,ఓటు వెయ‌ని వాళ్ళ‌ను కాళ్ళు చేతులు క‌ట్టి మ‌రి పోలింగ్ బూత్‌కు తీసుకొని వ‌చ్చి బిజేపికి ఓటు వేయించాలంటూ బిజేపి కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పిన యాడ్యుర‌ప్పా ,యూపి ఎన్నిక‌ల ఫ‌లితాలే ఇక్క‌డ కూడ పున‌రావృతం అవుతాయ‌ని ,మ‌న‌కు ఎన్నిక‌లు అయిపోయేంత వ‌ర‌కు విశ్రాంతి లేదని ,మ‌నం గెలిచే వ‌ర‌కు నిద్ర‌పోవ‌ద్దంటూ అదే స‌భ‌లో యాడ్యుర‌ప్పా కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు .దీనిపై స్పందిచిన ప్ర‌తిప‌క్షాలు ఒట‌మి భ‌యంతోనే బిజేపి నాయ‌కులు ఇలాంటి బెదిరింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ య‌డ్యుర‌ప్పాపై ఘాటైనా విమ‌ర్శ‌లే చేసాయి .ఇలాంటి బెదిరింపు మాట‌లు ప్ర‌జాసామ్య దేశంలో మాట్లాడం సిగ్గు చేటు అని కొంద‌రు సోష‌ల్ మిడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. మైకుంది క‌దా అని ఇష్ట‌మోచ్చిన‌ట్లు మాట్లాడే ఇలాంటి రాజ‌కీయ నాయ‌కుల‌కు ప్ర‌జ‌లు బుద్దిచెపుతారో లేదో తెలుసుకోవాలంటే ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లయ్యేవ‌ర‌కు ఆగాల్సిందే మ‌రి .