రాహుల్ గాంధీతో పెళ్ళి అంటే నాకు చాలా బాదేసింది

ఇండియా రాజ‌కీయ‌నాయ‌కుల‌లో మోస్ట్ బ్యాచ్‌ల‌ర్ ఎవ‌రంటే ట‌క్కునా గుర్తోచ్చే పేరు రాహుల్ గాంధీ అనే చెప్పాలి .కాంగ్రేస్ పార్టీ కేంద్రంలో అధీకారం చెప‌ట్ట‌డానికి కాంగ్రేస్ జాతీయ పార్టీ అధ్య‌క్షుడైనా రాహుల్ గాంధీ తీవ్రంగా కృషి చేస్తున్నా విష‌యం అంద‌రికి తెలిసిందే .అయితే ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం తీవ్ర‌స్థాయిలో కృషి చేస్తున్నా కాంగ్రేస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పెళ్ళి వార్త ఇప్పుడు అల్‌చ‌ల్ చేస్తుంది .అప్ప‌ట్లో రాహుల్ గాంధీ పెళ్ళి గురించి పుకార్లు చాలానే వ‌చ్చాయి .తాజాగా మ‌రోసారి రాహుల్ గాంధీ పెళ్ళి వార్త తెర‌పైకి వ‌చ్చింది .అయితే ఇసారి రాహుల్ గాంధీని పెళ్ళి చేసుకోబోయే పెళ్ళి కూతురు రాయ్ బ‌రేలి నియోజ‌క‌వ‌ర్గ‌పు ఎమ్మేల్యే అతిది సింగ్ అంటూ సోష‌ల్ మిడియాలో వార్త వ్య‌ర‌ల్ అయ్యింది . రాహుల్ గాంధీ,అతిది సింగ్ ల పెళ్ళి కోసం ఇరు కుటుంబాలు చ‌ర్చించుకున్నాయాంటూ కూడ పుకార్లు మొద‌లైయ్యాయి .అయితే వీట‌న్నిటికి పులిస్టాప్ పెడుతూ అతిది సింగ్ ఒక మిడియా స‌మావేశం ఏర్పాటులో మాట్లాడుతూ నా పెళ్ళిపై వ‌స్తున్నా పుకార్ల‌ల‌లో ఏ మాత్రం నిజం లేద‌ని అవన్ని అబ‌ద్దాల‌ని ఈ వార్త నన్ను చాలా బాద‌కు గురిచేసింద‌ని చెప్పుకొచ్చింది .రాహుల్ గాంధీ నాకు అన్న‌య్య లాంటి వాడ‌ని ,నాకు రాహుల్ గాంధీ తో రాఖి సంబంధం త‌ప్ప మ‌రే సంబందం లేద‌ని చెప్పిన అతిది సింగ్ ,రాహుల్ గాంధీతో పెళ్ళి వార్త నాకు బాద‌క‌లిగించింది దీనికి స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం కోస‌మే నేను ఈ మిడియా స‌మావేశం ఏర్పాటు చేసాన‌ని తెలిపింది . అయితే రాహుల్ గాంధీ కాంగ్రేస్ పార్టీని అధీకారంలోకి తీసుకురావ‌డానికి శ్ర‌మిస్తుంటే కొంద‌రు కావాల‌నే ఆయ‌న ప్ర‌చారం పక్క‌దారి ప‌ట్టాల‌ని చూస్తున్నారంటూ కొంద‌రు కాంగ్రేస్ నాయ‌కులు అంటున్నారు .ఇప్ప‌టికైనా రాహుల్ గాంధీ తొంద‌ర‌గా పెళ్ళి చేసుకోని పుకార్ల‌ల‌కు పులిస్టాప్ పెడ‌తాడో లేదో చూడాలి మ‌రి .