రెండుగా చీల‌లేద‌న్న రేవ‌ణ్ణ‌

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో రాజ‌కీయాలు నిమిష‌నిమిషానికి మారుతున్నాయి .జేడియ‌స్‌కు కాంగ్రేస్ మ‌ద్ద‌తివ్వ‌డంతో బీజేపి పార్టీల మ‌ధ్య చీలిక‌లు పెట్టే ప‌నిలో ప‌డింది .బీజేపి ఎక్కువ సీట్లు వ‌చ్చిన అధికారాన్ని ఎర్ప‌రిచేందుకు 8 సీట్లు త‌క్కువ రావ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటు పై ప‌ట్టు సాధించింది . దీని కొసం జేడియ‌స్ కీల‌క స‌భ్యుడు రెవ‌ణ్ణ‌ను త‌మ పార్టీకి మ‌ద్ధ‌తు తెల‌ప‌మ‌ని గాలం వేసింది .కాని కూమార స్వామి అప్ర‌మ‌త్తం అవ్వ‌డంతో బీజేపి ఆశ‌ల‌పై నీల్లు చ‌ల్లి న‌ట్లైంది .జేడియ‌స్ లో చీలిక‌లు ఏర్ప‌డ‌లేద‌నే దానిపై క్లారిటి ఇవ్వ‌డం కోసం రేవ‌ణ్ణ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో మాట్లాడుతూ 2004-2005 ఎన్నిక‌ల్లోనే బీజేపికి మ‌ద్ధ‌తిచ్చి త‌ప్పు చేశాన‌ని .దానివ‌ల్ల మా నాన్నా దేవే గౌడ్‌కు చెడ్డ పేరు వ‌చ్చింద‌ని ,ఆ త‌ప్పు మ‌ళ్ళీ ఇప్పుడు చేయ‌న‌ని ,చెప్పారు .బీజేపి పార్టీ వాళ్ళు న‌న్ను చేర‌మ‌ని వేరే వాళ్ళ ద్వారా కొన్ని సంకేతాలు పంపారు .కాని నేను వారికి చేర‌న‌నే సంకేతాలు పంపాన‌ని , వాళ్ళ‌ను నేను నేరుగా కూడ క‌ల‌వ‌లేద‌ని జేడియ‌స్ స‌భ్యుడు రెవ‌ణ్ణ ఆ స‌మావేశంలో చెప్పుకొచ్చారు .దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జేడియ‌స్ చీలీక‌లు ఏర్ప‌డ‌తాయ‌నే ఉత్కంట‌కు తెర‌దించిన‌ట్లైంది . ఐతే బీజేపి మాత్రం ఎట్టి ప‌రిస్థితిలో అధికారాన్ని వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళ‌కుండా నానా తంటాలు ప‌డుతుంది .ఒక వేళ ఇక్క‌డ ఏమైనా అన్యాయం జ‌రిగితే కాంగ్రేస్ పార్టీ సుఫ్రీం కోర్టుకు వెళ్ళె యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది .ఇప్పుడు ఎవ‌రికి అధికారం క‌ట్ట‌బెట్టాల‌నే ఆలోచ‌న గ‌వ‌ర్నర్ చేతిలో ఉంది .ముందు ముందు ప‌రిణామాలు ఇంకెళా ఉంటాయో తెలుసుకోవాలంటే వైట్ఎన్సీ అనే చెప్పాలి .ఎందుకంటే ఏ స‌మ‌యం ఎలా ఉంటుందో ఎవ‌రం చెప్ప‌లేం కాదా , అంతే కాదు క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి చూసి ఈ మాట అన‌క త‌ప్ప‌దు..