‘రేస్‌-3’ ట్రైలర్‌ వచ్చేసింది

అందరూ ఎంతోగానో ఎదురుచూస్తున్న ‘రేస్‌-3’ ట్రైలర్‌ వచ్చేసింది. బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిలింస్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో జాక్వలిన్‌ ఫెర్నాడెంజ్‌, బాబీ డియోల్‌, అనిల్‌ కపూర్‌, డైసీ షా వంటి భారీ తారాగణం ఉన్నారు.

‘రేస్‌’ సీక్వెల్‌లో గత సినిమాల తరహాలోనే మూడోపార్టు కూడా భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో తెరకెక్కింది. ‘యే రేస్‌ జిందగికీ రేస్‌ హై.. కిసికీ జిందగీ లేకేహీ ఖతం హోగీ’ వంటి షార్ప్‌, క్రిస్పీ డైలాగులతో మోస్ట్‌ యాక‌్షన్‌ సీన్స్‌తో.. సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేసేలా ట్రైలర్‌ ఉంది. ఒక వ్యాపార కుటుంబం.. ఆ కుటుంబంలోని అంతర్గత కుట్రలు నేపథ్యంగా సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ‘ఫ్యామిలీ ఉంటే చాలు.. నీకు శత్రువులు అవసరం లేదు’ అని ట్రైలర్‌లో చూపించడం సినిమా థీమ్‌ ఏంటో చెప్పకనే చెప్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్‌వన్‌గా ట్రెండ్‌ అవుతున్న ‘రేస్‌-3’ ట్రైలర్‌ భాయ్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈద్‌ సందర్భంగా జూన్‌ 15న ఈ సినిమా విడుదలకానుంది.