వాట్సాప్‌ యాడ్‌.. హీలర్‌ భాస్కర్‌ అరెస్ట్‌

ప్రకృతి వైద్యం పేరిట ప్రజలను మభ్య పెడుతున్న హీలర్‌ భాస్కర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 26న నిట్‌శాయ్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌లో భారీ ఎత్తున్న వర్క్‌షాపు నిర్వహించేందుకు భాస్కర్‌ ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రసవం సమయంలో వైద్యులు అవసరం లేకుండా.. సహజ పద్ధతిలోనే కాన్పులు చేయొచ్చన్న అంశం అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వాట్సాప్‌ గ్రూప్‌లలో వైరల్‌ చేశాడు. ఈ నేపథ్యంలో యాడ్‌లు ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ దృష్టికి చేరటంతో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆరోగ్యశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అతని చర్యలు అనైతికమని.. జనాల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తున్నాయని, ప్రమాదకరమైన వైద్య విధానాన్ని భాస్కర్‌ అవలంభిస్తున్నాడని ఐఎంఏ వాదిస్తోంది. సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన భాస్కర్‌.. గత కొన్నేళ్లుగా ప్రాణిక్‌ హీలింగ్‌, సహజ పద్ధతులంటూ వంద సంఖ్యలో పెషంట్లకు చికిత్స చేశాడు. పలు టీవీ షోల్లో కూడా అతను పాల్గొంటుడటం విశేషం. ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూసి ఈ మధ్యే తిరువూరుకు చెందిన కీర్తిక(28) అధిక రక్తస్రావంతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కూడా ఏఎంఏ దర్యాప్తుకు ఆదేశించింది.