వాల్‌నట్స్…సూప‌ర్‌! నట్స్

క్యాన్సర్‌కు నివార‌ణ‌:

రోజూ గుప్పెడు వాల్‌నట్స్‌తో హృద్రోగాలతో పాటు పేగు క్యాన్సర్‌ను నివారించవచ్చని తాజా అథ్యయనం పేర్కొంది. ఆరు వారాల పాటు రోజూ మూడోవంతు కప్పు వాల్‌నట్స్‌ తీసుకుంటే చెడు కొలెస్ర్టాల్‌ తగ్గడంతో పాటు ప్రమాదకర ఆమ్లాలు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయని అథ్యయనం తేల్చింది. ఈ తరహా ఆమ్లాలు పేగు క్యాన్సర్‌కు దారితీస్తాయని గత పరిశోధనలు పేర్కొన్న క్రమంలో ఆ ముప్పును కూడా వాల్‌నట్స్‌ తగ్గిస్తాయని పేర్కొంది.

కొవ్వుశాతాన్ని కరిగించడంతో హృద్రోగాల ముప్పు తగ్గుతుందని పరిశోధకులు విశ్లేషించారు. అధిక ఫైబర్‌ కలిగి ఉండే వాల్‌నట్స్‌తో కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, ఇది గుండె, జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా నిర్వహిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. వాల్‌నట్స్‌లో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఇవి దోహదపడతాయని శాస్త్రవేత్తలు సైతం గుర్తించారు. ఇక వాల్‌నట్స్‌లో ప్రమాదకర ఆమ్లాలు శరీరంలో పేరుకుపోవడాన్ని నియంత్రించే గుణం ఉండటంతో పేగు క్యాన్సర్‌ను నివారిస్తాయని అథ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌కు చెందిన ప్రొఫెసర్‌ హన్నా హల్చర్‌ చెప్పారు.