వాళ్ళు భాగా ఆడ‌లేదు మేమే చెత్త‌గా ఆడాం కోహ్లీ

ఐపీల్ సీజ‌న్ స్టార్ట్ అవుతుండ‌డందో ప్రేక్ష‌కులు గ‌త సంవ‌త్స‌ర సీజ‌న్ లో మ్యాచ్ ఫ‌లితాలు ప్ర‌స్తుత సిజ‌న్‌లో రిపీట్ అవుతాయాని అంచ‌నాలు పెట్టుకున్నారు .అదేవిధంగా ఐపీఎల్ 11వ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు దాదాపు అన్ని జట్లు చాలా స్ట్రాంగా ఉన్నాయని ఈ సారి క్రికెట్ మ్యాచ్‌లు చాలా ర‌స‌వ‌త్తంగా ఉంటాయ‌ని కొంద‌రు విశ్లేషకులు ఊహీంచారు . కానీ వాళ్ళ ఊహ సగం మ్యాచ్ లు అయిపోయే సరికి త‌ల‌కిందులైపోయింది . ముఖ్యంగా విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ అయితే ఊహించని విధంగా ఓటములను చ‌వి చూడాల్సి వచ్చింది. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఇండియా జట్టుకు సేవలందిస్తున్న విరాట్ ఐపీఎల్ లో మాత్రం ఆ తరహాలో జట్టును గెలిపించలేకపోతున్నాడు.ఐపీఎల్ లో పోటీ కూడా చాలా గట్టిగా నడుస్తోంది. హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ మాత్రం గ‌త సీజ‌న్‌లోని మ్యాచ్ ఫ‌లితాల‌ను పున‌రావృతం చేస్తు మంచి విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా జరిగిన మ్యాచ్ పై విరాట్ మాట్లాడుతూ సన్ రైజర్స్ బౌలింగ్ చాలా బలంగా ఉంది.వాళ్ళు గెల‌వ‌డానికి చాలా అంకిత‌భావంతో ఆడుతున్నారు .ఐతే గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాము అంటే నిజంగా ఆ జట్టు ఎంత స్ట్రాంగ్ గా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా జరిగిన మ్యాచ్ లో మాత్రం మా ఆట తీరు అంత‌గా లేదు . హైదరాబాద్ టీమ్ ఆట చూస్తే మాత్రం పోగ‌డ‌కుండా ఉండ‌లేము . ఐతే వారు గెలిచారు అనడం కన్నా మేము గెల‌వ‌డానికి ప్ర‌య‌త్నించ లేద‌నటమే ఉత్త‌మ‌మం అని విరాట్ వివరించాడు. ఇక హైదరాబాద్ మ్యాచ్ పరాజయంతో ఆర్సీబీ ఆడిన 10 మ్యాచ్ లలో ఏడవ పరాజయానిక్ చేరువైంది . దీంతో దాదాపు ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాన్ని ఆర్సీబి దాదాపు మిస్ చేసుకున్నట్లే అని చెప్పాలి ,ఐతే మరో వైపు హైదరాబాద్ మాత్రం ప్లే ఆఫ్ ఆశలు దాదాపు ఖ‌రారుగానే క‌నిపిస్తున్నాయి .