విట‌మిన్లు తీసుకోని వారిలో జ‌రిగే ప్ర‌మాదాలు

 

శ‌రీర పెరుగుద‌ల‌కు మ‌రియు శ‌రీరం ఆరోగ్యంగా ఉండ‌డానికి విట‌మీన్లు అనేవి చాలా ముఖ్య‌మైన‌వి .మ‌నం రోజు తినే ఆహారంలో విట‌మిన్లు ఉండేలా చూసుకోవ‌డం ఎంతో ఉత్త‌మ‌మైనా ప‌ని .చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారందరికి విటమిన్లనేవి చాలా అవసరమే. అయితే ఏ వయస్సులో ఏ విటమిన్లు అవసరమనే విషయంపై అవగాహన పెంచుకోవాలంటున్నారు వైద్యులు. చిన్న పిల్లలకు అంటే శిశువు నుంచి ఆరేళ్ల వయస్సు ఉన్న పిల్లలకు విటమిన్-ఎ, విటమిన్-సి చాలా అవసరం. ఈ దశలో వారికి సరైన మోతాదులో విటమిన్లు లభించకపోతే కంటి చూపు తగ్గిపోవడం, రికెట్స్, స్కర్వీ అనే సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెద్దవారిలో విటమిన్స్ తగ్గినపుడు అథెరోస్కెలెరోసిస్ అంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుందంటున్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులు, ఇమ్యూనిటీ తగ్గడంవల్ల ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతే కాదు ఎముకలు బలహీనంగా అయి ఆస్టియోపోరోసిస్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువేనంటున్నారు. ఆస్టియోపోరోసిన్ వస్తే ఎముకలు సులువుగా విరిగిపోతాయి. గర్భిణులకు ఫోలిక్‌యాసిడ్ అనే విటమిన్ మాత్రలు అవసరమవుతాయి. ఈ విటమిన్ లోపిస్తే పుట్టబోయే శిశువుల్లో అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని డాక్ట‌ర్‌లు చెపుతున్నారు . ఇక శాఖాహారుల్లో విటమిన్-బి12 లోపం ఎక్కువ‌గా ఉంటుంది. దీనివల్ల రక్తం తక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు మాత్రల రూపంలో ఆ లోటును భర్తీ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే విటమిన్ మాత్రలను వైద్యుల సలహామేరకు వాడటమే ఉత్తమం అని సూచిస్తున్నారు.