విమానంలోనే పుట్టిన రోజు వేడుక‌లు..

ఒకప్పటి సన్నీలియోని జీవితం వేరు…ఇప్పుడు వేరు. పోర్న్‌ స్టార్‌ నుంచి బాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యే వరకూ ఆమె జీవితంలో స్టార్‌ మెరుపులే ఉన్నాయి. కానీ ఇప్పుడు ముగ్గురు పిల్లలకు తల్లయ్యాకా ఆమె జీవితంలో మార్పు వచ్చింది. ‘‘పిల్లలతో ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నా’’ అంటోంది సన్నీ. ‘‘ఇది నా జీవితంలో చాలా కీలకమైన సమయం. ప్రతి క్షణం చాలా విలువైందే. నా పిల్లలతో గడుపుతున్న ఈ జీవితాన్ని మరి దేనితో పోల్చలేను’’అని చెప్పింది. ఆదివారం మదర్స్‌డేయే కాదు సన్నీ పుట్టిన రోజు కూడా. ‘‘పుట్టిన రోజుల్ని ఘనంగా జరుపుకొనే అలవాటు నాకు లేదు. ఈసారి నా పుట్టినరోజు అమెరికా నుంచి ఇండియాకొచ్చే విమానంలోనే జరిగిపోయింది’’అని చెప్పింది. అమెరికా టు ఇండియా తిరగడం కష్టంగా లేదా అంటే ‘‘సాధారణంగా లాస్‌ ఏంజెలెస్‌లో ఎక్కువ రోజులు ఉండను. కానీ పిల్లలు అంతా అక్కడే ఉన్నారు కాబట్టి ఈసారి ఎక్కువ రోజులు గడిపాను. ఇకపై ఎక్కువగా ఇండియాలోనే ఉంటాను. ఎందుకంటే నిషాను స్కూల్లో చేర్పించాలి కదా’’అని చెప్పింది సన్నీలియోని. ఆమె ప్రస్తుతం తన బయోపిక్‌ ‘కరేన్‌ జిత్‌ కౌర్‌’తో బిజీగా ఉంది.