శ్రీరెడ్డి ఫై కళ్యాణి చెప్పిన మరో షాకింగ్ న్యూస్.

 

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ వ్యతిరేక ఉద్యమం కాస్తా వ్యక్తిగత వివాదాలకు దారితీస్తున్నది. మొన్న పవన్‌ కల్యాణ్‌ తల్లిని ఉద్దేశించి నటి శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు కోరడం తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి వ్యక్తిగత జీవితానికి సంబంధించి నటి కరాటే కల్యాణి బహిర్గతం చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఇటీవల ఓ టీవీ చానెల్‌ చర్చలో శ్రీరెడ్డి వాదనతో విబేధించిన కల్యాణి.. లైవ్‌లోనే చేయిచేసుకోవడం విదితమే.

శ్రీరెడ్డికి కూతురు, కోట్ల ఆస్తులు: ‘కల్యాణి లీక్స్ మొదలయ్యాయి. పెళ్లి కాని విమలకు(శ్రీరెడ్డి అసలు పేరును చెబుతూ) ఇంటర్‌ పూర్తిచేసిన కూతురుంది. గడిచిన 10 ఏళ్ల నుంచి తల్లిదండ్రులతో సంబంధాలు లేవని శ్రీరెడ్డి చెప్పింది. కానీ కొంతకాలం కిందట కూకట్‌పల్లిలో కోట్ల విలువైన ఫ్లాట్‌లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఆమె వెంట తల్లికూడా ఉన్నారు. ఇదికాకుండా తను ఖరీదైన కార్లలో తిరుగుతుంది. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయో ఆమెకే తెలియాలి. మరికొన్ని లీక్స్‌ నాకు నచ్చినప్పుడు బయటపెడతా.. నా లీక్స్ నా ఇష్టం’’ అని నటి కరాటే కల్యాణి అలియాస్‌ కల్యాణి పడాల వెల్లడించారు.

ఫొటోలపై మండిపాటు: కాగా, నటి కరాటే కల్యాణి పోస్ట్‌ చేసిన ఫొటోల్లో శ్రీరెడ్డి కూతురిగా పేర్కొన్న పాప ఫొటోను కూడా ఉంచడం వివాదానికి దారితీసింది. ‘‘మీ గొడవల్లోకి కుటుంబ సభ్యులను, అందులోనూ పిల్లలను, వారి ఫొటోలను లీక్‌ చెయ్యడం ఎంతవరకు సబబు?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కల్యాణి లీక్స్‌పై శ్రీరెడ్డి స్పందన వెలువడాల్సిఉంది.