సామాన్యునికి చేరువ‌య్యేలా ప‌వ‌న్ తిరుప‌తి యాత్ర

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న అనేది చాలా మంచి ప‌రిణామం మెచ్చుకోద‌గ్గ‌ది అని చెప్ప‌వ‌చ్చు . ఒక నాయ‌కుడ‌నేవాడు అహంభావాన్ని విడ‌నాడాలి ,ఒక నాయ‌కుడ‌నేవాడు ప్ర‌త్యేక కార్చ‌చ‌ర‌ణ అనేది క‌లిగి ఉండాలి,ఒక నాయ‌కుడ‌నే వాడు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ఉండాలి ఇవ‌న్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌లో అల‌వ‌ర్చుకుంటున్నారనే అనాలి . దానిలో భాగంగా ఒక సామాన్య భ‌క్తుని లాగ తిరుప‌తి వెళ్ళి మెట్ల ద్వారా దేవున్ని చేరుకోవాల‌నుకోవ‌డం, 300రూపాయ‌ల టికెట్ ద్వారా ద‌ర్శ‌నం చేసుకోవ‌డం ఇవ‌న్ని త‌మ అభిమానులు ,కార్య‌కర్త‌ల‌లో కొత్త ఉత్స‌హాన్ని నింప‌డం లాంటివి అనే చెప్పాలి .అంతే కాకుండా ద‌ర్శ‌నం అనంత‌రం మిగ‌తా ఆల‌యాల్లో సంద‌ర్శిండం ఒక రోజు అక్క‌డే గ‌డ‌ప‌డం వంటివి చూస్తుంటే ఒక నాయ‌కుడు సామాన్య ప్ర‌జ‌నికానికి చేరువ అయ్యే అంశాలు అని చెప్ప‌వ‌చ్చు .కాని కొంద‌రు న‌డ‌వ‌లేక మ‌ధ్య‌లోనే కూర్చున్నార‌న‌డం ,అప్పుడే అలిసి పోయారా అంటూ కామెంట్లు పెట్ట‌డం ఏ మాత్రం మంచి ప‌ద్ద‌తి కాదు.ఎందుకంటే ఎవ్వ‌రైనా స‌రే అన్ని మెట్లు ఎక్కాలంటే ఖ‌చ్చితంగా ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఆగ‌క త‌ప్ప‌దు ,అలాంటిది సినిమాలో చేసిన‌ట్టు నిజ జీవితంలో చేయ‌డానికి ఇక్క‌డ కెమెరాలు ,గ్రాఫిక్స్ లాంటివి ఏం వాడ‌రని తెలుసుకొని కామెంట్ చేయాలి .మొత్తం మీద బ‌స్సు టూర్‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుప‌తి యాత్ర అభిమానులు ,కార్య‌క‌ర్త‌లలో కొత్త ఉత్సాహం నింప‌డానికి క‌లిసోచ్చె అంశం అనే చెప్పాలి . తిరుప‌తిలో కాలిన‌డ‌క‌న ద‌ర్శ‌నం చేసుకోవ‌డం ,సామాన్య భ‌క్తుని లాగ అక్క‌డ గ‌డ‌ప‌డం ప్ర‌జ‌ల‌ను మ‌రింత చేరువ చేసేవిగా చెప్ప‌వ‌చ్చు ,ఇదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యాన్ ముందుకు వెళితే ఒకే సారి సీఎం అవుతార‌ని చెప్ప‌లేం కాని భ‌విష్య‌త్తులో ఆ చాన్స్ మిస్ కాకుండా ఉడ‌డంలో తోడ్ప‌డుతుంది .