సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన అవినాష్‌ రెడ్డి

అవినాష్‌ రెడ్డి లేఖ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వైఎస్సార్‌ కడప జిల్లా ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తుంగభద్ర డ్యాంలో ఉన్న నికర జలాలను చిత్రావతి జలాశయానికి తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ లేఖ రాశారు. తుంగభద్ర డ్యాం నుంచి నికర జలాలను తరలిస్తే పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌, లింగాల కుడి కాల్వకు నీరు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు.

కృష్ణా నది వరద జలాలను నమ్ముకుని తుంగభద్ర నికర జలాల హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. తుంగభద్ర నుంచే పులివెందుల, ధర్మవరం వంటి పట్టణాలకు 2 టీఎంసీల తాగునీరు ఇవ్వాలి. అవి పోను సాగు నీటికి ఏమి మిగలదన్నారు. తుంగభద్ర నికర జలాల హక్కులను ఎలా వదులుకోమంటారని ప్రశ్నించారు. చిత్రావతి కింద దుస్థితి చేసే దివంగత నేత వైఎస్సార్‌ ఆ ప్రాజెక్టును పూర్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. మా నికర జలాలను కొల్లగొట్టే ప్రయత్నాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.