సీఎం సమక్షంలో: రాజీయనా ఏవీ సుబ్బారెడ్డి మంత్రి అఖిలప్రియ

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఆళ్లగడ్డ పంచాయితీపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మీడియా సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే సుబ్బారెడ్డి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించారు. తనపై రాళ్ల దాడి చేయించిన రాష్ట్ర మంత్రి అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు తన డిమాండ్‌ను పట్టించుకోలేదని, తన ఆవేదనను అర్థం చేసుకోలేదంటూ సుబ్బారెడ్డి అసహనంతో ఉన్నారు. తన మాట చంద్రబాబు పట్టించుకోకపోవడంపై కినుక వహించిన సుబ్బారెడ్డి మీడియా సమావేశం జరుగుతుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పార్టీ అభివృద్ధికి తాను ఎప్పటిలాగే కృషి చేస్తానని సుబ్బారెడ్డి తెలిపారు.