సెన్సేషనల్‌ హీరోతో జాన్వీ సౌత్‌ ఎంట్రీ

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌కు పరిచయం అయిన భామ జాన్వీ కపూర్‌. తొలి సినిమా ధడక్‌తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, తల్లి బాటలో బహు భాషానటిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు అంగీకరిస్తూ బిజీగా ఉన్నా.. దక్షిణాది దర్శకులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.

ప్రముఖ దక్షిణాది సినీ విశ్లేషకుడు రమేష్ బాలా.. జాన్వీ సౌత్‌ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్ చేశారు. జాన్వీ కపూర్‌ త్వరలోనే సౌత్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలిపారు. ఇద్దరు తమిళ దర్శకులు ఒక తెలుగు దర్శకుడు జాన్వీతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిపారు. అంతేకాదు సౌత్‌లో జాన్వీ తొలి సినిమా విజయ్‌ దేవరకొండతో ఉండే అవకాశం ఉందని హింట్‌ ఇచ్చారు.