సొనాలీ బింద్రే భావోద్వేగం

క్యాన్సర్‌తో బాధపడుతున్న హీరోయిన్‌ సొనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. చికిత్సలో భాగంగా జుట్టు కత్తిరించుకున్న సొనాలీ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సొనాలి.. కష్ట సమయంలో తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సుదీర్ఘమైన పోస్ట్‌ చేశారు.

‘నా అభిమాన రచయిత్రి ఇసాబెల్‌ అలెండే మాటలు ఎప్పుడూ నాకు గుర్తుంటాయి. కష్టం వచ్చినపుడే మనలో దాగున్న ధైర్య సాహసాలు వెలుగులోకి వస్తాయి. విషాదకరమైన సమయాల్లోనే కొన్ని అద్భుతాలు చోటుచేసుకుంటాయి. నాపై ఇంతగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా తమ స్ఫూర్తివంతమైన కథలతో నాలో ధైర్యం నింపుతున్న వారికి రుణపడి ఉంటాను. క్యాన్సర్‌ను జయించిన మీ వంటి వారి గురించి తెలుసుకున్నపుడు నేను ఒంటరిని కాననే భావన నాలో కొత్త ఆశల్ని చిగురింపజేస్తుంది. ప్రస్తుతం నా జీవితంలో ప్రతిరోజూ ఒక సవాలుతో కూడుకున్నదే. సూర్యోదయం కోసం సానుకూల దృక్పథంతో ఎదురుచూస్తున్నానంటూ’ ఆమె చేసిన పోస్ట్‌ చేసిన సందేశం అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.

Source : Click here