హీరో సిద్దార్థ్ పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.

 

నటుడు సిద్దార్థ్ పై ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. ఆయన పుట్టిన రోజుపై సిద్దార్థ్ చేసిన కామెంట్ వెటకారంగా ఉందని వ్యాఖ్యానిస్తూ, టాలీవుడ్ జోలికి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే, తమిళ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ ప్రభాస్ పుట్టిన రోజుకు ఇంకా 100 రోజుల సమయం ఉందని, ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందిస్తూ, “నెక్ట్స్ పుట్టినరోజుకు 465 రోజులుంది” అని కామెంట్ పెట్టాడు.

ఇది ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పించగా, సిద్దార్థ్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. టాలీవుడ్ జోలికొస్తే చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ‘ఎందుకు ఇంత వెటకారం? నీ ఫ్రెండే కదా?’ అని ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యపై సిద్దార్థ్ స్పందిస్తూ, “అందుకే భయ్యా. ఫ్రెండు కాబట్టే… ఫ్రీడం తీసుకున్నా… డార్లింగ్‌ కూడా నవ్వుతాడు జోక్‌ విని.

ప్రతిదానికి టెన్షన్‌ పడితే లైట్‌ తీసుకోడానికి టైమ్‌ ఉండదు కదా భయ్యా?” అంటూ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు. ఇకనైనా ఫ్యాన్స్ శాంతిస్తారేమో?!