హృదయాలకి చేరువయ్యే కథ : నా పేరు సూర్య

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. లగడపాటి శిరీష శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పిస్తున్నారు. మే 4న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శనివారం థియేట్రికల్‌ ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు అల్లు అర్జున్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రతి భారతీయుడు ఇది నా చిత్రం అని కాలర్‌ ఎత్తుకొని చెప్పేంతగా హృదయాలకి చేరువయ్యే కథ ఇది. ఫస్ట్‌ ఇంపాక్ట్‌లోనూ, టీజర్‌లోనూ వినిపించిన సంభాషణలు ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. ఇందులో ఆశ్చర్యపరిచే విషయాలు చాలా ఉన్నాయి. ఈ నెల 29న హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుకని భారీ హంగుల మధ్య, అభిమానులు గుర్తు పెట్టుకొనేలా నిర్వహిస్తున్నాం’’ అన్నారు.