2, 3 రోజుల్లో హైదరాబాద్‌ వస్తానన్న …డైరెక్షర్‌ రాజసింహ

నేను క్షేమంగానే ఉన్నా..

రుద్రమదేవి రైటర్‌ రాజసింహా తాను క్షేమంగా ఉన్నట్లు ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఆయన కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు లేక డిప్రెషన్‌లో ఉన్నట్టు, ముంబైలోని తన రూంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు నిన్న వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదంటూ సోషల్‌మీడియాలో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు.

‘నేను రాజసింహా. నేను క్షేమంగా ఉన్నాను. నాకు డయాబెటిక్‌ ఉంది. షుగర్‌ లెవల్‌ డౌన్‌ అవ్వడం, రాత్రి పక్కన ఎవరూ లేకపోవడంతో కాస్త సీరియస్‌ అయింది. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. నా గురించి కంగారు పడ్డ వాళ్లందరికి ధన్యవాదాలు. ఇంకో 2, 3 రోజుల్లో హైదరాబాద్‌ వస్తాను’ అంటూ వీడియోలో తెలిపారు.

సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప సినిమాతో రాజసింహా దర్శకుడిగా పరిచయం అయ్యారు. శంకర్‌దాదా ఎంబీబీయస్‌, బొమ‍్మరిల్లు, ఝుమ్మందినాధం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమదేవి సినిమాలకు రాజసింహా రచయితగా పనిచేశారు. సంబరం, నీ స్నేహం, టక్కరిదొంగ లాంటి సినిమాల్లో నటుడిగానూ కనిపించారు. జయంత్‌ సీ పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన పలు చిత్రాలకు సెకండ్‌యూనిట్‌ దర్శకుడిగా పనిచేశారు.