25 నుండి జూన్ 1కీ వ‌చ్చిన.. నా నువ్వే

 

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా నువ్వే. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌ డిఫరెంట్‌ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. తమిళ దర్శకుడు జయేంద్ర డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు రవితేజ నేటటిక్కెట్టు రిలీజ్‌ అవుతుండటంతో పాటు సమ్మర్‌లో రిలీజ్‌ అయిన పలు చిత్రాలు ఇప్పటికీ హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లు సాధిస్తుండటంతో నా నువ్వేను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్‌. వారం ఆలస్యంగా జూన్‌ 1న సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.