27నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహుని జయంతి ఉత్సవాలు

 

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలను ఈనెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 27న శ్రీవెంకటపతి అలంకార సేవ, లక్షకుంకుమార్చన, 28న కాళీయమర్థని అలంకార సేవ, లక్షపుష్పార్చన చేయనున్నారు. 29న సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు పరిసమాప్తికానున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో యాదాద్రిలో మూడురోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.