వోడాఫోన్‌ కొత్త ప్లాన్లు 98 జీబీ,126 జీబీ డేటా ఫ్రీ

టెలికాం రంగంలో డేటావార్‌ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్లను ప్రకటించిన నేపథ్యంగా మరో ప్రధాన ఆపరేటర్‌ వోడాఫోన్‌ కొత్త ప్లాన్‌తో కస‍్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. తన ప్రీపెయిడ్ చందాదారుల కోసం రెండు కొత్త ప్లాన్లను వోడాఫోన్‌ ప్రకటించింది.

వోడాఫోన్ రూ.549, రూ.799 రెండు రీచార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 549 ప్లాన్‌లో రోజుకు 3.5జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం 98 జీబీ డేటా నెలకు అందిస్తుంది. దీనితో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.

ఇక రెండో ప్లాన్‌ రూ.799 రీచార్జ్‌పై వోడాఫోన్ వినియోగదారులు రోజుకు 4.5జీబీ డేటా వాడుకోవచ్చు. దీని ప్రకారం మొత్తం126జీబీ ఉచితం. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. ఇంకా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఆఫర్‌ చేస్తోంది.