366 రోజుల పాదయాత్ర… వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా : 366 రోజుల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి గుడి, మసీదు, చర్చిలను సందర్శిస్తానని తెలిపారు. 1001 మంది ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటానని వెల్లడించారు. 150 పల్లెల్లో నిద్ర చేస్తానని వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.