ఆమెకు 26.. అతడికి 68.. ఇద్దరూ కలిసి..

మీరెన్నైనా చెప్పండి.. నాకెందుకో చూడగానే నచ్చేశాడు. మనసు ముందు వయసు ఓడిపోయింది. పాప్ సింగర్‌గా బోలెడంత మందితో కలిసి పని చేస్తుంటాను. అయినా నాకు నా సహనటుడు బిల్ ముర్రే నచ్చేశాడు. అతడితోనే ప్రేమా.. పెళ్లి అంటోంది కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరై రెడ్ కార్పెట్‌పై హొయలు పోయిన సెలీనా. ఆమె నటించిన ది డెడ్ డోన్ట్ డై సినిమాని కేన్స్‌లో ప్రదర్శించడంతో సెలీనా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చిత్రంలో సెలీనాతో పాటు బిల్ ముర్రే ప్రధాన పాత్రలో నటించారు.

అప్పటి నుంచి వారిద్దరి మధ్యా క్రష్ మొదలైందట. సినిమా పూర్తయ్యేసరికి అది మరింత ముదిరిపోయింది. ఈ కారణంగానే పెళ్లితో ఇద్దరూ ఒక్కటవ్వాలనుకుంటున్నారు. అయితే సెలీనా ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం తన మాజీ ప్రియుడు.. పాప్ సింగర్ కూడా అయిన జస్టిస్ బీబర్ సెలీనాను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో కోపంతో ఈ నిర్ణయం తీసుకుందేమో అన్న ఆలోచన చూసే వారికి కలుగుతుంది. సెలీనా మాత్రం ఆ రూమర్స్‌ని కొట్టి పారేస్తూ ముర్రేతో ఏడు అడుగులు నడవడానికి రెడీ అయిపోతోంది.