ఆక్టోపస్‌ను తిందామనుకుంది బేర్‌మని ఏడ్చింది

బతికున్న ఆక్టోపస్‌ను తిందామనుకున్న ఓ యువతికి భయానక అనుభవం ఎదురైంది. ప్రాణాలు రక్షించుకునేందుకు ఆక్టోపస్‌ చేసిన ఎదురుదాడిలో సదరు యువతి ముఖంపై గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే.. ఓ చైనీస్‌ బ్లాగర్‌ ప్రాణాలతో ఉన్న ఆక్టోపస్‌ను తింటూ వీడియో తీసేందుకు ప్రయత్నించింది. దానిని ఎత్తుకుని నోట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆక్టోపస్‌ తన మీసాలతో ఆమె ముఖాన్ని గట్టిగా పట్టుకుంది. దీంతో దానిని విడిపించుకునేందుకు ఆమె చాలా ప్రయత్నించింది. కానీ అది ఒక పట్టాన వదలకపోవడంతో ఏడుపు లంకించుకుంది. బాధతో విలవిల్లాడుతూ.. చివరకు ఎలాగోలా దానిని వదిలించుకుంది.

ఈ నేపథ్యంలో ‘అసలు నీకు మతి ఉండే ఇలా చేశావా… బతికున్న ఆక్టోపస్‌ను తినాలని ఎలా అనుకున్నావు’ అంటూ నెటిజన్లు ఆమె చర్యను తప్పుబడుతున్నారు.