చర్చనీయాంశమైన డాక్టర్‌ వ్యవహారం..

ఆయన కోదాడలో ఓ ప్రముఖ వైద్యుడు. తన వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని లైంగికంగా లోబర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యింది. విషయం తెలుసుకున్న ఆయన భార్య సదరు నర్సును వైద్యశాలనుంచి పంపించింది. అయినా సదరు వైద్యుడు ఆ నర్సుతో స్థానికంగానే వేరే చోట రహస్య కాపురం పెట్టించాడు. ఆమెను అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి పెంచాడు. అం దుకు ఆమె ఒప్పుకోకపోవడంతో రోగులకు మందులు రాసే చిట్టీ మీద తన ఇష్టపూర్తిగా రాసి ఇస్తున్నట్లు పలు హమీలు ఇచ్చాడు.

యువతి పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తానని, 100 గజాల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తానని, రూ.3 లక్షల విలువ చేసే బంగారం ఇస్తానని సంతకం చేసి ఇచ్చాడు. దీంతో ఆమె అబార్షన్‌న్‌చేయించుకోవడానికి ఒప్పుకుని కోదాడలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాల వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆయన అబార్షన్‌ చేయడానికి నిరాకరించి విషయం ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో సదరు యువతి తనకు వైద్యుడు రాసి ఇచ్చిన హమీల చిట్టీని ఆయనకు చూపడంతో బయటకు పొక్కింది. ఎవరు పెట్టారో ఏమోగాని ఈ చిట్టీ ఇప్పుడు స్థానిక సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కోదాడలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది.