చిరుతకు చుక్కలు చూపించిన గ్రామా సింహాలు

చిరుత మీద సింహం దాడి చేసింది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా అడవికే రాజైన సింహం అనుకుంటే తప్పులేకాలేసినట్లే అసలు ట్విస్ట్ ఏంటంటే గ్రామాల్లో తిరిగే గ్రామసింహాలు చిరుతకు చుక్కలు చూపించాయి. వాయువేగంతో పరిగెత్తే చిరుతను కుక్కల గుంపు తరిమి తరిమికొట్టేందుకు ట్రై చేశాయి. దీంతో ఓవర్‌నైట్‌లో విలేజ్‌ డాగ్స్‌ హీరోలుగా మారిన ఘటన వైరల్‌గా మారింది.

ఐదారు కుక్కలు చిరుతను రౌండప్‌ చేసి రెచ్చిపోయాయి. ఒకదాన్ని నుంచి తప్పించుకునేలోపే మరొకటి మీదపడి కరిచేయడంతో పంజా విసరలేకపోయింది. ఏం చేయాలో తెలియక కూలబడిపోయింది. చిరుతకు రక్తం కారిన విడిచిపెట్టకుండా వీధికుక్కలు విరుచుకుపడ్డాయి. తమ అండర్‌ గ్రౌండ్‌లోకి తెచ్చుకున్న కుక్కల గుంపు కదలలేని స్థితిలో ఉన్న చిరుతను వదిలిపెట్టకుండా పీక్కుతిన్నాయి.

ఫుడ్‌కోసం వచ్చిందో లేక దారితప్పిందో లేక గాయపడ్డదో తెలియదు కానీ ఓ చిరుత శునకాల కంటపడింది. ఇంకేంముంది కుక్కలు అరుపులతో మూకుమ్మడిగా చిరుతను చుట్టుముట్టడంతో బెంబేలెత్తిపోయింది. కుక్కల దాడికి ఎదురు ఫైట్‌ చేయలేక చిరుత తోక ముడవక తప్పలేదు. కుక్కఅరుపులతో అటవీ ప్రాంతం మార్మోగిపోయిన ఘటనను కొందరు సెల్‌ఫోన్‌ బంధించగా వైరల్‌గా మారింది.