పీకలదాకా తాగొచ్చిన భర్త కోర్కె తీర్చమంటూ అక్కడే ఆమెని..

మద్యం మత్తు మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. తనతో పాటు అతడిపై ఆధారపడ్డ కుటుంబాన్ని వీధిపాలు చేస్తుంది. బిడ్డకి జ్వరమొచ్చి ఆసుపత్రి బెడ్‌పై ఉంటే.. చిన్నారికి సేవలు చేస్తూ అక్కడే ఉన్న భార్యని కోర్కె తీర్చమంటూ వెంటపడ్డాడో ప్రబుద్దుడు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది. కండ్రిగ గ్రామానికి చెందిన నంద, పద్మలకు పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. కూలి పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు.

ఇటీవల కుమార్తె జమున అనారోగ్యం బారిన పడడంతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. దీంతో తల్లి పద్మ ఆసుపత్రిలోనే ఉంటూ బిడ్డ బాగోగులు చూసుకుంటోంది. ఇలా ఉండగా ఆదివారం పీకలదాకా తాగిన భర్త నేరుగా ఆసుపత్రికి వచ్చి అందరి ముందే పద్మని కోర్కె తీర్చమంటూ బలవంతం పెట్టాడు. కాదంటే ఇంకేం గోల చేస్తాడోనని అతడితో పాటు వెళ్లింది. అతడి కోర్కె తీరిన అనంతరం మళ్లీ భార్యతో గొడవ పడ్డాడు భర్త. విచక్షణా రహితంగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే ఆసుపత్రి మెట్లపై పడిపోయింది. ఉదయం నిద్ర లేచిన జమునకు తల్లి కనిపించకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. ఆసుపత్రి మెట్లపై అపస్మారక స్థితిలో పడివున్న తల్లిని చూసి వైద్యులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. మెడ, తల, ముక్కుతో పాటు మరికొన్ని చోట్ల రక్త స్రావం కావడాన్ని వైద్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.