ఇంగ్లండ్‌ Vs పాకిస్తాన్‌: పీటర్సన్‌ Vs అక్తర్‌

లండన్‌ : ప్రపంచకప్‌ 2019లో భాగంగా నేడు (సోమవారం) ఆతిథ్య ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ సోమవారం సాయంత్రం ఉన్నప్పటీకీ.. ఇరు దేశాల మాజీ ఆటగాళ్ల మధ్య మాత్రం అప్పుడే ప్రారంభమైంది. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ల మధ్య ట్విటర్‌ వేదికగా మాటలయుద్దం జరుగుతోంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో కంగుతిన్న పాక్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలని ఆ దేశ అభిమానులు, మాజీ ఆటగాళ్లు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్తర్‌ తమ ఆటగాళ్లకు స్పూర్తిదాయకంగా ఉండేలా ఓ ట్వీట్‌ చేశాడు. దానికి కెవిన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేసిన ఆనందంలో ఉన్న తన పాత ఫొటోను జత చేశాడు. పైగా దీనికి ‘ మీ జట్టుకు మీరు ప్రాతినిథ్యం వహించాలంటే రక్తం, చెమట, దూకుడు, గుండే వేగంగా కొట్టుకోవడం వంటివి ఉండాలి. ఇవే మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తాయి. వెళ్లండి గట్టిపోటీనివ్వండి’ అంటూ ట్వీట్‌ చేశాడు.