ప్రభాస్‌ని రికమండ్‌ చేసిన యష్‌

కేజీయఫ్‌ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్‌, బాహుబలి స్టార్ ప్రభాస్‌ను ఓ సినిమాకు రికమండ్‌ చేశాడు. సాండల్‌వుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌. కేజీయఫ్ సినిమాతో సూపర్‌ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యష్‌ను ఓ దర్శకుడు ఇంట్రస్టింగ్ స్టోరీతో సంప్రదించాడట. భారీ హీరోయిజం స్టార్‌ ఇమేజ్‌ను డిమాండ్ చేసే ఆ కథకు తాను సరిపోనని ప్రభాస్‌ అయి పర్ఫెక్ట్ అని చెప్పి పంపించాడట యష్‌.

అంతేకాదు తానే స్వయంగా ప్రభాస్‌కు కాల్‌ చేసి, ఆ దర్శకుడు చెప్పే కథ వినమని ప్రభాస్‌కు సజెస్ట్ చేశాడట. యష్‌ చూపించిన చోరవతో ఆ డైరెక్టర్ ఫుల్‌ ఖుషీ అయ్యాడన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం యష్‌ కేజీఎఫ్ 2 షూటింగ్‌లో బిజీగా ఉండగా, ప్రభాస్‌ సాహోతో పాటు రాధకృష్ణ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నాడు.