ఓయో రూమ్ లో ప్రేమికుల ఆత్మహత్య

లవ్ మ్యారేజీకి పెద్దలు ఒప్పుకోరని భావించిన ఇద్దరు లవర్స్ హైదరాబాద్ చందానగర్ లో ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ నారాయణపురం మండలం కొర్రతండాకు చెందిన మోహన్ నాయక్, మందురబాద్ ప్రాంతానికి చెందిన స్వర్ణలత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించని చందానగర్ లోని వివి ప్రైడ్ లాడ్జిలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే స్వర్ణలత ఇంటి నుంచి పారిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఎల్.బి.నగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా స్వర్ణలత చందానగర్ లో ఉన్నట్టు గుర్తించారు. రెండు రోజుల క్రితమే లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. అయితే వీరిద్దరి ప్రేమ విషయం స్వర్ణలత కుటుంబ సభ్యులకు తెలియదన్నారు పోలీసులు.