టీమిండియా ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు ఆదివారం ఇంగ్లండ్ జట్టు బ్రేక్ వేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమి చవిచూసినా… సెమీస్‌కు వెళ్లేందుకు టీమిండియాకు మంచి అవకాశాలే ఉన్నాయి. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు జమ్ము అండ్ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ.. టీమిండియా ఓటమిపై సోషల్ మీడియాలో స్పందించిన ఆమె ‘అసంబద్ధంగా చెబుతున్నానని మీరు నన్ను అనుకోవచ్చు.. కానీ, వరల్డ్ కప్‌లో భారత్ విజయ పరంపరకు బ్రేక్ పడటానికి కొత్తగా వారు ధరించిన ఆరెంజ్ జెర్సీ కూడా ఒక కారణం’ అని ట్వీట్ చేశారు. కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో “మెన్ ఇన్ బ్లూ” కాస్తా… “మెన్ ఇన్ ఆరెంజ్‌”గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆరెంజ్ కలర్ కొత్త జెర్సీ ఆవిష్కరించినప్పటి నుంచే వాటిపై విమర్శలు వస్తుండగా.. ఇప్పుడు ముఫ్తీ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.