‘మమ్మీ’ మనిషి కథలో కొత్త మలుపు..

ఎలుగుబంటి దాడిలో గాయపడి నెలరోజుల నరకం తర్వాత ప్రాణాలతో బయటపడిన మమ్మీ మనిషి అలెగ్జాండర్‌ కథ కొత్త మలుపు తిరిగింది. ఆ మమ్మీ మనిషి అసలు ఎలుగుబంటి దాడికి గురవ్వలేదని, అతడిది రష్యానే కాదని, వేరే కారణాలతో కజకిస్తాన్‌లోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. మమ్మీ మనిషి అలెగ్జాండర్‌పై ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ కథను ప్రపంచానికి మొదట పరిచయం చేసిన ఓ మాస్కో పత్రిక అతడి వివరాలు అందించిన వారికి నగదు బహుమతి ఇస్తామంటూ ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది అతడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

అతడి వివరాల కోసం అన్వేషణ ప్రారంభించిన ‘జెల్లో’ అనే గుంపు.. అతడు రష్కాకు చెందిన వాడు కాదని, కజకిస్తాన్‌ వాడని పేర్కొంది. అతడు ఆసుపత్రిలో ఉండగా తీసిన వీడియోలో కజక్‌ బాష మాట్లాడారని తెలిపింది. మమ్మీ మనిసి.. అక్టోబ్‌ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించింది. అతడు ఎందుకిలా మారడన్న సంగతి తెలియదంది. అయితే అతడు తమ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడంటూ అక్టోబ్‌లోని ఏ ఆసుపత్రి కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏది ఏమైనప్పటికి మమ్మీ మనిషి ఐడెంటిటీ ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది.