ధోనీ.. నీ కూతుర్ని కిడ్నాప్‌ చేస్తా ..

కింగ్స్‌ పంజాబ్‌ యజమాని చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనికి వార్నింగ్‌ ఇచ్చారు. ఐపీఎల్‌లో భాగంగా గత ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించడంపై ప్రీతిజింటా ఆనందం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ అనంతరం ధోనితో కరచాలనం చేశారు.

ఈ మేరకు ట్విటర్‌లో ఆమె.. “కెప్టెన్ కూల్‌కి చాలామంది అభిమానులు ఉన్నారు. వారిలో నేనొకరిని. అయితే, ఈ మధ్య కాలంలో నేను ధోనితో పాటు ఆయన కూతురు జీవాకు కూడా ఫ్యాన్‌ని అయ్యా. నా దృష్టి ఆమెపై పడింది. జీవా విషయంలో జాగ్రత్తగా ఉండమని ధోనీని హెచ్చరిస్తున్నా. ఆమెను కిడ్నాప్‌ చేయాలనుకుంటున్నాను” అని ట్విటర్‌లో సరదా వ్యాఖ్యలు చేశారు. కాగా, ధోని.. ప్రీతి మైదానంలో దిగిన ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలు, ట్విటర్‌లో 3.3 లక్షల లైకులు రావడం విశేషం. ఐపీఎల్ 12వ సీజన్‌లో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్స్‌కు చేరుకోని సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సమానంగా 12 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్‌రేట్‌ (-0.251) తక్కువగా ఉండటంతో కింగ్స్ పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. దీంతో ఇంటిదారి పట్టింది.