రాజమౌళి అడిగితే ఆలోచించకుండా చేస్తా..

బాలీవుడ్ లో దేదే ప్యార్ దే సినిమా సూపర్ హిట్టయ్యాక రకుల్ ప్రీత్ కు డిమాండ్ పెరిగింది. సినిమా హిట్ తో బాలీవుడ్ లో మూడు ప్రాజెక్ట్స్ సైన్ చేసినట్టు సమాచారం. ఇటు టాలీవుడ్ లో ఆమె చేతిలో మన్మధుడు 2 సినిమా ఉన్నది. కోలీవుడ్ లో సూర్య ఎన్జీకే, కార్తికేయన్ సినిమాలు ఉన్నాయి. దేదే ప్యార్ దే సినిమా హిట్ తరువాత అభిమానులు ట్విట్టర్ లో అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.

స్నేహితులు ఎక్కడ ఉంటె అదే తనకు ఇష్టమైన ప్రదేశం అని చెప్పిన రకుల్ సమంత అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ప్రస్తుతం తన మదిలో దేదే ప్యార్ దే సినిమా పాటలు ఉన్నాయని సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. బాలీవుడ్ ప్రమోషన్స్ విషయంలో చాలా ప్లాన్ గా ఉంటారని టాలీవుడ్ లోను అలాంటి ప్లాన్ ఉంటె తప్పకుండా పాల్గొంటానని అంటోంది రకుల్.

ఇక లవ్ ప్రపోజల్ గురించి అడిగితె… ఇప్పటి వరకు తనకు ఎవరు ప్రపోజ్ చేయలేదని చెప్పింది. రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే అస్సలు మరో విషయం ఆలోచించకుండా సైన్ చేస్తానని చెప్పింది రకుల్. జీవితంలో ఉన్న కోరికల్లో ఒకదాని గురించి చెప్తూ.. తనకు నచ్చిన ఫుడ్ బాగా తినాలని, కానీ లావు అవ్వకూడదని అంటోంది. ఎప్పుడు సంతోషంగా ఉండటమే ఫిట్నెస్ రహస్యం అని చెప్తోంది.