అర్జున్‌ రెడ్డి దర్శకుడికి బంపర్‌ ఆఫర్‌!

సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. తొలి సినిమా తోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌, అర్జున్‌ రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్‌ సింగ్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఏడాది టాప్‌ 3 గ్రాసర్స్‌లో నిలుస్తుందంటున్నారు విశ్లేషకులు. కబీర్‌ సింగ్‌ సక్సెస్‌తో సందీప్‌కు ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది. కబీర్‌ సింగ్ సక్సెస్‌ గురించి విన్న సల్మాన్‌ ఖాన్‌, సందీప్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాను టీ సిరీస్‌ సంస్థ నిర్మించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈవార్తలపై సల్మాన్‌, సందీప్‌ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.