మహేష్ బాబుతో బాహుబలి రేంజ్ సినిమా…

మహెహ్ బాబు కు కాలం కలిసొచ్చింది. వరసగా రెండు హిట్స్ కొట్టాడు. అనిల్ రావిపూడితో చేయబోతున్న సినిమాపై అంచనాలు ఉన్నాయి. కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి తప్పకుండా ఆకట్టుకుంటుంది. స్వతహాగా అనిల్ రావిపూడి రచయిత కావడంతో పంచ్ డైలాగులు ఉండనే ఉంటాయి. ఈ సినిమా తరువాత ఎవరితో చేస్తారు అనే విషయం పక్కన పెడితే …

అర్జున్ రెడ్డి సినిమాతో వెలుగులోకి అచ్చిన సందీప్ రెడ్డి వంగ…మహేష్ బాబుతో ఓ భారీ మూవీకి ప్లాన్ చేస్తున్నాడట. సౌత్ సినిమాల గురించి చెప్పుకోవాలంటే అందరు బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు చెప్పుకుంటున్నారని, వాటికి మించే కథతో మహేష్ తో సినిమా చేయాలని అనుకుంటున్నట్టు సందీప్ రెడ్డి పేర్కొన్నాడు.