విద్యార్థిని హత్య ఆందోళన ఉధృతం

రాయచూరులోని సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధు అనుమానస్పద మృతి కర్ణాటకలో సంచలనం రేపుతుంది. ఆమె మరణించి మూడు రోజులు అవుతున్నప్పటికి కేసును ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో ప్రజా సంఘాలు ఆందొళనలను కోనసాగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఆందోళనలు ఉదృతం అవుతుండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నిందితుడు సుదర్శన్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇంటర్నల్ పరిక్షలంటూ ఈ నెల13 మధు ఇంట్లో నుంచి కాలేజికి బయలుదేరింది. అయితే ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు కేసును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మూడో రోజుల అనంతరం మధు సగం కాలిన శవంగా, ఉరేసుకున్న స్థితిలో కనిపించింది. ఘటనా స్ధలి పోలీసులు ఓ లేఖ కూడా స్వాధినం చేసుకున్నారు. సబ్జెక్టులు ఫెయిలైన కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీన్ని మధు తల్లిదండ్రులు ఖడించారు లేఖ కన్నడంలో ఉందని తమ బిడ్డకు ఆ భాషే రాదని అలాంటిది లేఖ ఎలా రాస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే తను అన్ని సబ్జెక్టులు పాసయిందని తెలిపారు. తమ బిడ్డను ఎవరో హత్య చేశారని వారు ఆరోపించారు.

మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండుతో సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం జోరందుకుంది. దీంతో `స్పందించిన ముఖ్యమంత్రి కుమారస్వామి కేసును సీఐడీకి అప్పగించారు. ప్రస్తుతం సీఐడీ బృందం విచారణ ప్రారంభించింది.