ఆ బీర్ల కోసం మా జిల్లాను విలీనం చేయండి..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఓ వెరైటీ విన్నపం ఇది.. సీఎం కేసీఆర్‌కు డైరెక్ట్‌గా తన కోరికను విన్నవించుకోవడం కష్టం అనుకున్నాడేమో… మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను తన విజ్ఞప్తిగా వేదికగా చేసుకున్నాడో వ్యక్తి. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం మూటపల్లి గ్రామానికి చెందిన బ్యాలెట్‌ బాక్స్‌ను తెరిచిన అధికారులకు జగిత్యాల జిల్లా వాసుల పేరుతో ఓలేఖ దొరికింది. తమ జిల్లాలో కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ బీరు దొరకడం లేదని తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన అజ్ఞాత వ్యక్తి… ఈ బ్రాండ్‌ బీరు కోసం పక్క జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నాడు. తమ మీద దయతలిచి కింగ్‌ఫిషర్‌ బీర్‌ను అందుబాటులో ఉంచాలని కోరాడు. అంతే కాదు.. తన లేఖలో నోట్‌ అంటూ .. కింగ్‌ ఫిషర్‌ బీర్ల కోసం జిగిత్యాల జిల్లాను కరీంనగర్‌లో విలీనం చేయాలనే సూచన చేశాడా వ్యక్తి. ఇప్పుడా లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.