కృష్ణ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

అలనాటి నటి, దర్శకురాలు విజయ నిర్మల నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సంగతి తెలిసిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ కృష్ణ కుటుంబానికి సంతాపం తెలిపారు. అంతేగాక ఈరోజు నేరుగా కృష్ణగారి ఇంటికి వెళ్లి ఆయన్ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, విజయ నిర్మలగారి భౌతికకాయానికి నివాళులర్పించారు. జగన్ వెంట విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు.